అప్పుడు రజనీకాంత్ అంటే 2007లో సూపర్ స్టార్ నటించిన శివాజీ చిత్రం.ఇప్పుడు ధనుష్ అంటే..ఈ ఏడాది ధనుష్ నటించిన రాయన్. ఇక 17 ఏళ్లు ఏంటే.. శివాజీ విడుదలైన 17 ఏళ్లకు రాయన్ విడుదలైంది అని అర్ధం. అది సరే.. ఈ రెండింటికి ఏంటి లింక్ అంటారా..? స్టోరీ అక్కడికే వస్తోంది. 2007లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ చిత్రం దక్షిణాదిన సంచలన విజయం సాధించింది. సూపర్ స్టార్ కెరీర్ లోనే కాదు, టోటల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, ఈ చిత్రం తొలిసారి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. శివాజీ తర్వాతే 150 కోట్ల క్లబ్ ఓపెన్ అయింది. ఆ తర్వాత విక్రమ్ ఐతోనూ, అలాగే విజయ్ తేరీ అనే చిత్రంతోనూ, అజిత్ విశ్వాసం అనే మూవీతోనూ 150 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఇన్నాళ్లకు యువ హీరో ధనుష్ నటించిన రాయన్ తొలిసారి ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తానే డైరెక్ట్ చేసి , హీరోగా నటించిన రాయన్, ధనుష్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. తమిళనాట బలమైన హీరోగా నిలబెట్టింది. ఒకప్పుడు రజనీ, ధనుష్ కాంబినేషన్ లో ఏదైనా రాస్తే, చాలా క్రేజ్ కనిపించేది. కాని ఇప్పుడు రజనీకాంత్ కూతురుకు ధనుష్ కు విడాకులు ఇవ్వడంతో, మాజీ మామఅల్లుళ్లుగా మారిపోయారు. అయినప్పటికీ ధనుష్ కు మాత్రం రజనీకాంత్ అంటే ఇప్పటికీ అభిమానమే.. మాజీ మామ అంటే దైవసమానం.