త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి విజయ్

అందుకు పవన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడా..?

సంచలనం సృష్టిస్తున్న పవన్ అభిమాని విజయ్ తీరు!

తమిళ స్టార్ హీరో , దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం  లేదు.గత దశాబ్ధ కాలంలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ తమిళ నాట అగ్ర కథానాయకుడిగా వెలిగాడు. రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానాన్ని అందుకున్న నటుల్లో ఒకడిగా మారాడు.అలాంటి నటుడు, ఒక్క సినిమా చేస్తే మినిమం 300 కోట్లు వసూళ్లు కొల్లగొట్టగలడు, పైగా తాను నటించే సినిమాలకు దాదాపు 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుంటున్నాడు,  అలాంటి హీరో ,తానెంతో ఇష్టంగా కొనుక్కున్న కారును అమ్మకానికి పెట్టడం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారుతోంది.2012లోనే విజయ్ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసాడు.ఈ కార్ కోసం అప్పట్లోనే విజయ్ లీగల్ సమస్యలను సైతం ఎదుర్కొన్నాడు.ఇప్పుడు ఈ కారును దాదాపు 26 కోట్లకు విజయ్ బేరం పెట్టినట్లు సమాచారం.26 కోట్లు అంటే చిన్న విషయం కాదు.కాని కోట్లల్లో ఉన్న విజయ్ అభిమానుల్లో ఒకరు ఈ కారును కొనుగోలు చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.కాని విజయ్ లాంటి స్టార్ హీరో ఇప్పటికిప్పుడు తన ఫేవరేట్ కారును అమ్మాకానికి పెట్టడానికి ప్రధానమైన కారణం,తాను పెట్టిన పొలిటికల్ పార్టీ అయి ఉంటుందని ప్రచారం సాగుతోంది.ఫిబ్రవరిలోనే తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్టాపించాడు విజయ్.త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నాడు.ఈ దశలోనే పార్టీని నడిపేందుకు కావాల్సిన డబ్బు కోసం విజయ్ తన కారును సైతం అమ్మకానికి పెట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం గతంలో పార్టీని నడిపేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పిల్లల పేరి ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ను బ్రేక్ చేసారు. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును అమ్మేసారు. ఇల్లు , స్థలాలు అయితే లెక్కే లేదు. ఒక దశలో పార్టీని నడిపేందుకు కోటి రూపాయలు లేని రోజులను కూడా పవన్ చూసారు. 2024లో జరిగిన ఎన్నికల్లో సైతం డబ్బు సమస్య కారణంగానే అన్ని స్థానాల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు పవన్. ఇప్పుడు ఇదే తరహా రాజకీయాన్ని విజయ్ అనుసరించనున్నట్లు కనిపిస్తోంది. పైగా పవన్ కు విజయ్ అభిమాని కావడం,ఇక్కడ మరో విషయం.

contact@pridetelugu.com

error: Content is protected !!