కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక పై తనని కమల్ , కమల్ హాసన్ అని మాత్రమే పిలవాలని,ఎక్స్ లో పెద్ద పోస్ట్ రాసుకొచ్చారు. కళకంటే కళాకారుడు ..ఎన్నటికీ గొప్పవాడు కాదు. నేను ఎప్పుడూ స్థిరంగా ఉండాలని, నటనలో లోపాలను మెరుగుపురుచుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్న.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ,పోస్ట్ పెట్టారు కమల్. ఆరు దశాబ్ధాల సుదీర్ఘ నట ప్రస్థానంలో కమల్ ఎప్పుడూ , అభిమానులకు ఎలాంటి కండీషన్ పెట్టలేదు. సూపర్ స్టార్ అని పిలిచినా, ఆండవర్ అంటూ కోట్లాది మంది అభిమానులు ఏళ్లుగా పిలుచుకుంటున్నా, ఉలగనాయగన్ అంటూ ట్యాగ్ పెట్టి సినిమా ప్రారంభానికి ముందు టైటిల్ వేసినా, తెలుగువాళ్లు లోకనాయకుడు అని రాసినా ఎన్నడూ అబ్జెక్షన్ చెప్పలేదు. కాని ఇప్పటికిప్పుడు కమల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది అర్ధం కాకుండా ఉంది. భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే భారీ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.