నా పై అమెరికా కుట్ర చేసింది..సెయింట్ మార్టిన్ ద్వీపం పై అమెరికా పెత్తనం కోరింది..అలా చేయనందుకే.. నేను వైదొలగాల్సి వచ్చింది..అమెరికాకు తలొగ్గితే ..ఇప్పటికీ అధికారంలో ఉండేదాన్ని..బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని షేక్ హసీనా చేసిన ఆరోపణలు ఇవి…ఇప్పుడు ఈ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి…అమెరికా పై హసీనా చేసిన ఆరోపణలతో,సెయింట్ మార్టిన్ ద్వీపం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఏంటి.. ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం.. ఎక్కడుంది..ఎందుకింత వివాదాస్పదంగా మారింది?

బంగాళా ఖాతంలో అదొక అందాల పగడాల దీవి..మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లు మాత్రమే..కాని సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం… అందుకే అమెరికా కన్నుపడింది అనేది ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది.సెయింట్ మార్టిన్స్ ద్వీపం బంగ్లాదేశ్ లో అత్యతం కీలక వాణిజ్య ఓడరేవు అయిన కాక్స్ బజార్ కు ,  కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.బంగ్లాదేశ్ కు ఉన్న ఏకైక పగడపు దీవి అయిన సెయింట్ మార్టిన్.. అరుదైన జీవ జాతులతో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం.1947 భారత విభజన సమయంలో పాకిస్థాన్ కు, 1971లో బంగ్లాదేశ్ పరిదిలోకి వెళ్లింది. ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారీకేళ్ ద్వీపమంటారు.కోకోనట్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు.ఇందులో 3700 మంది నివసిస్తుంటారు.

చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం ఇక్కడి వారి ప్రధాన వృత్తి. సహజ సౌందర్యం కారణంగా ఇటీవల కాలంలో ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంహగానూ మారింది. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది.

చైనాతో వైరం దృష్ట్యా భావి అవసరాల కోసం ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు చాలా కాలంగా అమెరికా ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ ద్వీపం ఆసక్తి లేదని అమెరికా అధికారులు అధికారికంగా పలుమార్లు చెప్పినా.. ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేస్తూ వస్తోంది. దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్ట్ ను చైనా నిర్మిస్తోంది. అందుకే దీనికి సమీపంలోనే స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది.

ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి.. అమెరికాకు బంగాళఖాతంలో పట్టు లభించేలా చేస్తే..ఇప్పటికీ పదవిలో కొనసాగేదాన్ని .. దానికి ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేసాను అన్నారు హసీనా. అయితే బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని మార్చెందుకు అమెరికా కుట్ర పన్నిందని షేక్ హసీనా చెప్పినట్లుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్ని కట్టుకథలు అంటూ ఆమె కుమారుడు సాజిబ్ వాహెద్ చెప్పుకొస్తున్నారు.ఏది ఏమైనా బంగ్లాలో రాజకీయ సంక్షోభం వెనుక సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఉంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది

error: Content is protected !!