యుద్ధం ముగిసిపోనుందా అంటే, రష్య – ఉక్రెయిన్ మధ్య లేక, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య అని ప్రపంచం సంబరపడేందుకు ఇంకా సమయం ఉంది. ఆరోజులు త్వరలో రావాలని కోరుకుందాం. ఈలోపు ఇజ్రాయెల్ – హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెజ్ బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూతప్రాయంగా అంగీకారం తెలిపారు. గత ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హెజ్ బొల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు లెబనాన్ లో 3500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 లక్షలకు పైగా పౌరులు  ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లారు. అయితే కీలక అంశాలపై ఇంకా హెజ్ బొల్లాతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ముందు అవన్ని పరిష్కారం కావాలని, అప్పుడే కాల్పుల విరమణ ఒప్పందానికి పరిగణిమిస్తామని నెతన్యాహు గట్టిగా చెబుతున్నారు. గాజా కేంద్రంగా పనిచేస్తోన్న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కు,  మద్దతుగా గత ఏడాది అక్టోబర్ లో హెజ్ బొల్లా.. ఇజ్రాయెల్ పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగానే అప్పటి నుంచి ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పై దాడులు చేస్తోంది.

error: Content is protected !!