78వ స్వాతంత్ర్య దినోత్సవానికి యావత్ భారత జాతి సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఎర్రకోటపై జెండా ఎగురవేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోనున్నారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించిన చరిత్ర ఉంది. ఎర్రకోట నుంచి ఇప్పటి వరకు మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ.. వీరిద్దరు మాత్రమే 11 కన్నా ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగురవేసారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో 10 సార్లు మాత్రమే ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నేహ్రూ అత్యఅధికంగా 17 సార్లు ఎర్రకోట పై నుంచి జెండా ఎగురవే సారు. ఇక ఇందిరాగాంధీ 16 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రధానిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఉలా ఉండగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ అంతటా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.