సినిమా తీయడం వేరు. ఆ సినిమాను సరైన డేట్ కు రిలీజ్ చేయడం వేరు. ఇక ప్రమోషన్స్ లో,మీడియా ముందు జాగ్రత్తగా ఉంటూ..ఎంత కావాలో అంతే రివీల్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వేరు.ఈ విషయంలో చిరు చాలా పూర్. గతంలో చాలా సార్లు సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ ఎలిమెంట్ రివీల్ చేసేసారు.ఒకసారి రంగస్థలం కథ చెప్పేసారు. ఆ తర్వాత ఓ ఈవెంట్ లో ఆచార్య టైటిల్ కూడా అనుకోకుండా చెప్పేసారు.అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తమిళ నటుడు, ప్రస్తుతం దక్షిణాది బిజీ విలన్ ఎస్.జే. సూర్య, రెండు అడుగులు ముందుకేసి తాను నటిస్తున్న కొత్త సినిమా కథను చెప్పేసాడు. స్టోరీకి పెట్టిన టైటిల్ బట్టి, మీకు అర్ధమై ఉండాలి. అదేంటి అంటే, హై నాన్న తర్వాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీలో నటిస్తున్నాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎస్. జే.సూర్య సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తూ.. సరిపోదా శనివారం టైటిల్ పెట్టడానికి రీజన్ చెప్పేసాడు. సినిమాలో నానికి కోపం ఎక్కువ అట. చిన్నప్పటి నుంచి అదే సమస్యతో ఇబ్బందులు తెచ్చుకునేవాడట.అందుకు తన తల్లి కోపాన్ని అదుపులో ఉంచుకునే మార్గం సూచించిందట. వారానికి 7రోజులు ఉంటాయి. 6 రోజులు కామ్ గా ఉండమని చెప్పిందట. ఎంత కోపం వచ్చినా, ఆ కోపాన్ని ప్రదర్శించకుండా, శనివారం వరకు అణిచిపెట్టుకోమందట. అమ్మకు ఇచ్చిన మాటతో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడట నాని. మొత్తంగా టైటిల్ వెనుక ఆడియెన్స్ కు ఉన్న క్యూరియాసిటీని తన ఇంటర్వ్యూతో రివీల్ చేసేసాడు సూర్య. పైగా నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిందని చెప్పాడు. దాదాపు 150 కోట్లతో సరిపోదా శనివారం తెరకెక్కిందట. స్టోరీని సూర్య రివీల్ చేసేయడంతో నాని ఆల్రెడీ టెన్షన్ పడుతున్నాడని సమాచారం.