ఇప్పుడు టాలీవుడ్ లో అత్యఅధిక క్రేజ్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే, అది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్త ఓజీ మాత్రమే.. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే, హీరో ఎవరున్నా సరే.. ఓజీ అప్ డేట్ కావాలంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. స్వయంగా పవన్ కల్యాణ్ సభల్లోనే జనం ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని, తన సినిమా సరిపోదా శనివారం ప్రమోషనల్ ఈవెంట్స్ లో నిర్మాత దానయ్యను, ఓజీ అప్ డేట్ అడిగాడు. అందుకు దానయ్య కూడా త్వరలోనే ఓజీ అప్ డేట్ ఇస్తాను అన్నాడు. టాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉన్న ఓజీ అప్ డేట్ ఇవ్వడానికి, నిజానికి దర్శక, నిర్మాతల చేతుల్లో ఏం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల్లో ఉంది. ప్రస్తుతం పవన్ తన శాఖల పనులతో బిజీగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి తిరిగి షూటింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంమటున్నారు. ముందుగా 25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఓజీ చిత్రీకరణను పూర్తి చేయాలనకుంటున్నారు పవన్. ఆ తర్వాత హరిహార వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. గత ఏడాది పవన్ బ్రో అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ వ్యవహారాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు కొద్దిగా సమయం తీసుకుని అది కూడా విజయవాడకు దగ్గర్లో, ఒక సెట్ వేసి, అక్కడ షూటింగ్ నిర్వహించేందుకు దర్శకనిర్మాతలతో చర్చించారు. వచ్చే ఏడాది వేసవిలో ఓజీ విడుదల అయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!