మహారాజా, కొద్ది రోజులుగా ఈ టైటిల్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అందుకు రీజన్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఆల్రెడీ ఈ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరో విశేషం ఏంటంటే ఈ టైటిల్ కు దగ్గరిగా అంటే మాహారాజ్ పేరుతో, మహేష్ తో రాజమౌళి మూవీ ప్లాన్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ టైటిల్ ఇలా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగానే, నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఈ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. బాబి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న కొత్త చిత్రానికి గతంలో వీరమాస్ అనే టైటిల్ అనుకున్నారు. కాని ఇప్పుడు కొత్త టైటిల్ అన్వేషణలో ఉన్నారట. అందులో భాగంగా మహారాజ్ అనే టైటిల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ తర్వాత బాలయ్య ఈసారి మహారాజ్ టైటిల్ తో తిరిగొస్తుండటం విశేషం. వచ్చే సంక్రాంతి పండక్కి నందమూరి మహారాజ్ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నట్లు సమాచారం.