
ప్రైడ్ తెలుగు స్పోర్ట్స్ న్యూస్ – ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను కోల్పోయి, నిండా బాధలో ఉన్న టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. 2016 తర్వాత తొలిసారి మూడో స్థానానికి పడిపోయింది టీమ్ ఇండియా. పాకిస్థాన్ తో రెండు టెస్టుల విజయం తో దక్షిణాఫ్రికా జట్టు, టీమ్ ఇండియా ను వెనక్కి నెట్టి, టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత్ ను 1-3తో ఓడించి పైనల్ కు చేరుకున్న ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్స్ ను పెంచుకుని టాప్ పోజీషన్ కు చేరుకుంది. మరో వైపు టీమ్ ఇండియా గత 8 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఆరు మ్యాచ్ ల్లో ఓటమిని చూసింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఈ ప్రభావంతోనే భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపయన్ షిప్ ఫైనల్ కు దూరమైంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో భారత్, నాల్గవ స్థానంలో ఇంగ్లాండ్, ఐదవ స్థానంలో న్యూజీలాండ్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఉన్నాయి.