దేవర విడుదలకు సిద్ధమవుతున్న వేళ…ఈ సినిమా పాటలు మార్కెట్ లో అలరిస్తున్న సమయంలో,తన అభిమానులను వరుస అప్ డేట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆల్రెడీ బాలీవుడ్ వెళ్లి వార్ -2 అనే భారీ చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఆగస్ట్ 9న సినిమాను ఘనంగా ప్రారంభించబోతున్నారట. అదే నిజమైతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నటించే చిత్రం ఇప్పట్లో లేనట్లే అని ప్రచారం సాగిన సమయంలో, సినిమాను ప్రారంభించడం అంటే,అది రూమర్స్ కు చెక్ పెట్టడమే.మరో వైపు కల్కి బ్లాక్ బస్టర్ తో ప్రభాస్ ఇమిడియెట్ గా సలార్ సీక్వెల్ కు డేట్స్ ఇస్తాడని బాగా ప్రచారం సాగింది.కాని ఇప్పుడు ఈ సీక్వెల్ షూటింగ్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.అందుకే ప్రశాంత్ నీల్ అర్జెంటుగా ఎన్టీఆర్ తో తాను ఎప్పుడో రాసి పెట్టుకున్న డ్రాగన్ అనే కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్ట్ 9న లాంఛ్ చేసి ఆ వెంటనే మరికొద్ది రోజులకు షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట.ఈ మూవీలో హీరోయన్ గా రష్మిక పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇఫ్పుడు డ్రాగన్ తెరకెక్కడం మొదలు పెడితే మాత్రం సలార్ సీక్వెల్ అనేది,డ్రాగన్ రిలీజ్ తర్వాతే ఉండే అవకాశం ఉంది. మరోవైపు అజిత్ తో ప్రశాంత్ నీల్ రెండు చిత్రాల డీల్ కుదుర్చుకోవడం,తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. మరి ఇన్ని ప్రాజెక్టులను ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది.

error: Content is protected !!