ఎన్టీఆర్,  తన కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జీవితమే మారిపోయింది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. తారక్ యాక్టింగ్ పవర్ వరల్డ్ కు తెల్సింది.అందుకే బాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు , మన ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నారు. అదే వార్ -2. అయితే జూనియర్ చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నప్పటి,కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రంపైనే, అతని అభిమానులు,కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కేజీయఫ్ సిరీస్ లో రాఖీభాయ్ పాత్రకు, ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ .. ఈ కాంబినేషన్ కు ఇంకా .. ఇంకా క్రేజ్ పెంచేలా చేసాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఎనౌన్స్ మెంట్ జరుపుకున్నప్పటికీ… చాలా కాలంగా సెట్స్ పైకి వెళ్లడం లేదు. మరో వైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ సీక్వెల్ తో బిజీ అవుతాడని ప్రచారం సాగుతుండటంతో,ఒక దశలో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉంటుందో అనే అనుమానాలు మొదలయ్యాయి. కాని రూమర్స్ అన్నిటిని పక్కనపెడుతూ , సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. కాకపోతే సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే మొదటి షెడ్యూల్ కు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నాడు. దేవర రిలీజ్ ఉండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ అన్నిటిని పూర్తి చేసుకుని, ఆ తర్వాత షెడ్యూల్ కు షూటింగ్ కు అటెన్డ్ అవుతాడు. బహుశా దసరా సీజన్ తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో వైపు హీరోయిన్ గా రష్మిక ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు డ్రాగన్ వస్తున్నాడు.. అంటూ సంబరపడుతున్నారు.

contact@pridetelugu.com

error: Content is protected !!