ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ భేటి అయ్యారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం పై, పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్ స్కీని ప్రధాని మోదీ కోరారు. శాంతిని నెలకొల్పే దిశా ఎలాంటి ప్రయత్నం జరిగినా ..కీలకపాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ హామీ ఇచ్చారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతివైపే నిలిచాయమని ఉక్రెయిన్ పర్యటనలో మోదీ స్పష్టం చేసారు. నాలుగు ప్రధాన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసాయి. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్ పర్యటనకు రావాలని మోదీ అహ్వానించారు.