స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన భగత్ సింగ్ ..హింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మారు. 25 ఏళ్ల వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెల్సినా భగత్ సింగ్ చేసిన సాహసం అసమాన్యం. అలాంటి విప్లవకారుడి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘట్టాలను మన కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907లో సెప్టెంబర్ 28న జన్మించారు. ఇన్నాళ్లకు మళ్లీ పాకిస్థాన్  ప్రభుత్వం భగత్ సింగ్ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పూంఛ్ హౌస్ లోని భగత్ సింగ్ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యాలరీలో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, అప్పటి వార్త పత్రికలు, భగత్ జీవిత విశేషాలు, ఇలాంటివి ఎన్నో ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇది భారత్ కు మంచి విషయం.

error: Content is protected !!