2023 బాలీవుడ్ లీడింగ్ లో కనిపించింది.
2024లో మాత్రం టాలీవుడ్ లీడ్ చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు.
సంక్రాంతికి రిలీజ్ అయ్యే గుంటూరు కారం నుంచే తెలుగు హీరోల బాక్సాఫీస్ వేట మొదలు కానుంది.
2022లో సర్కారు వారి పాట రిలీజైన తర్వాత,
మహేష్ లాస్ట్ ఇయర్ అంతా బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు.
2024 సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేస్తున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో,
ఇండస్ట్రీలో ఈ మూవీపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
సంక్రాంతికి మహేష్ బాబు వస్తుంటే,
సమ్మర్ సీజన్ లో ఇద్దరు పాన్ ఇండియా హీరోలు రంగంలోకి దిగుతున్నారు.
ఏప్రిల్ 5న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అలాగే మే 9న ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం కల్కి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆగస్ట్ 15న పుష్పరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
2021లో పుష్పలో కనిపించాడు ఐకాన్.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పుష్పరాజ్ గా తిరిగి రానున్నాడు.
ఇక వినాయక చవితి లేదా దసరా పండక్కి,
త్రిబుల్ ఆర్ హీరో రామ్ చరణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ను,
సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!