ప్రైడ్ న్యూస్ – తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యూగ్ లైన్ ను,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేసారు. ఇక పై మన రాష్ట్రాన్ని,తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ పునర్మిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ, ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయ పదంగా నిలుస్తుందని రేవంత్ అన్నారు.అమెరికా పర్యటనలో భాగంగా కాలఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా టెక్ యూనికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్. ఆయా సంస్థలను తెలంగాణకు ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి, అందరం కలకికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు.అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, దానిని సూచించే నినాదం ఉన్నదని, ఇదే తరహాలో తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ లో పిలుద్దామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.