రవితేజకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస పెట్టి ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి.ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ ఇమేజ్ ఉన్న రవితేజ,ఇప్పుడు ఫ్లాప్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఈ మధ్య కాలంలో ధమాకా ఒక్కటి బ్లాక్ బస్టర్ అయింది. రవితేజ కెరీర్ లో మొదటి సారి వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. దాంతో మాస్ రాజా లో వేగం పెరిగింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి చిత్రాలు చేసాడు. ఇవన్ని కూడా ఇటు రవితేజను, అటు రవన్న అభిమానులను నిరుత్సాహపరిచాయి. ఈ సమయంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా కోసం చేతులు కలిపాడు రవితేజ. కాని ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాకుండా మొదటి వీకెండ్ దాటేవరకు బాక్సాఫీస్ దగ్గర కుప్పకూలింది. దాంతో మాస్ రాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

నిజానికి రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ ధమాకా బ్యానర్ లోనే మిస్టర్ బచ్చన్ వచ్చింది.కాని సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. ఇంతకు ముందు సేమ్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించిన ఈగల్ విడుదలైంది.ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో కలపి రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయని చెప్పాలి. అందుకే రవితేజ తనవంతుగా కొంత పారితోషికాన్ని తిరిగిచ్చేస్తున్నాడు. అంతే కాదు సేమ్ బ్యానర్ లోనే అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లోనే మరో సినిమా చేసేందుకు, అందుకు రెమ్యూనరేషన్ లో కూడా డిస్కౌంట్ ఇస్తాను అన్నాడట. సేమ్ ఆఫర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పీపుల్స్ మీడియాకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!