తెలుగు బిగ్ బాస్‌ను బాస్ నాగార్జున ఎలా అయితే ఏళ్లకు ఏళ్లుగా హోస్ట్ చేస్తున్నాడో, ఇప్పుడు నయా సీజన్ ను హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడో,సేమ్ టు సేమ్ తమిళంలో కూడా కమల్ కొన్నేళ్లుగా అదే చేస్తున్నాడు.తమిళ బిగ్ బాస్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే బిగ్ బాస్ మాత్రమే..2017లో ఈ షో ప్రారంభమైనప్పుడు , అంటే బిగ్ బాస్ తమిళ్ మొదటి సీజన్ నుంచి,కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మోస్ట్ కాంట్రవర్షియల్ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ను,లోకనాయకుడు అద్భుతంగా  నడిపారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కాని, బిగ్ బాస్ తమిళ్ 8వ సీజన్ కు దూరంగా ఉండాలని కమల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా కమల్ సినిమాలు తగ్గించారు. ఆ సమయంలో ఆయన బిగ్ బాస్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు. కాని ఇప్పుడు విక్రమ్, కల్కి లాంటి విజయాలు చూసిన తర్వాత,చేతినిండా చిత్రాలతో బిజీ అయిన సమయంలో, ఇక బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించేందుకు కమల్ దగ్గర టైమ్ లేదు.అందుకే సినిమాల కోసమే ఈ పాపులర్ షోకు బ్రేక్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఇంటి ఇంటికి వెళ్లే అవకాశం తనకు లభించిందని చెప్పుకొచ్చారు.కమల్ హాసన్ తప్పుకోవడంతో నయా సీజన్ ను ఏ స్టార్ హీరో హోస్ట్ చేస్తాడు అనేది క్యూరియాసిటీని కలిగిస్తోంది.

error: Content is protected !!