కరోనా తగ్గిందని, కోవిడ్ కాలం పోయిందని సంబరపడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. గత కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండటాన్ని డబ్ల్యూహెచ్ ఓ గమనించింది.అందుకే కరోనా విషయంలోఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాణం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఇటీవల కాలంలో సీజన్ తో సంబంధం లేకుండా కేసుల పెరుగుదల కనిపిస్తోందని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో కనీసం 40 మంది అథ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోస వ్యాధుల బారిన పడ్డారని చెప్పుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసఫిక్ లో కొత్త ఇన్ఫెక్షన్స్ నమోదు అయ్యాయి. వాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదం తగ్గించువచ్చు అని డాక్టర్లు సూచించారు. టీకాల ఉత్పత్తిని మరోమారు పెంచాల్సిన సమయం ఆసన్నమైందని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది.

error: Content is protected !!