మొత్తం 15 విభాగాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధ్యక్షులను నియమించారు. పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని నియమంచారు జగన్. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సి వరుదు కళ్యాణిని నియమించారు. అలాగే రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్ నియమితులయ్యారు. వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, అంగన్ వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు జగన్. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు వై.ఎస్.జగన్.  పార్టీ మరో ప్రధా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడం జరిగింది.

error: Content is protected !!