
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని .. ఆరోపించి డైరెక్ట్ గా ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. పొరుగు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అందుకే అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందంటున్నారు యూన్ సుక్. యూన్ రెండేళ్ల క్రితమే అధ్యక్ష పదవి చేపట్టారు. అప్పటి నుంచి ప్రతి పక్షాల నియంత్రణలో ఉన్న పార్లమెంట్ కు వ్యతిరేకంగా తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉత్తర కొరియాకు అనుకూలంగానే పార్లమెంట్ ను కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే నెపంతో ఎమర్జెన్సీ మార్షల్ లా తీసుకొచ్చారు యూన్ సూక్.