పారిస్ లో జరుగున్న ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్, ఇప్పుడు మరో రికార్డ్ ను బద్దలుకొట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా ఘనమైన చరిత్రను లిఖించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన మను బాకర్, ఇఫ్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో సరబ్ జోత్ సింగ్ కలసి భారత్ కు కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియా జోడి(లీ–యోజిన్ ) తో పోటీ పడి పతకాన్ని పట్టుకొచ్చారు మను- సరబ్ జోడి. దక్షిణ కొరియా జోడి 10 సాధించగా, భారత్ జోడి 16 పాయింట్లు సాధించిన చరత్ర సృష్టించింది. దాంతో స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత్  అథ్లెట్ గా మను బాకర్ రికార్డ్ సృష్టించినట్లైంది. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ అథ్లెటిక్స్ లో రెండు పతకాలు సాధించిన రికార్డ్ ఉంది.

error: Content is protected !!