ఆగస్టు 5- శ్రావణ మాసం ప్రారంభం

ఇంటింట పండగ వాతావరణం, ప్రతీ రోజూ ఓ వ్రతం.. ఇటు వాయనాలు ఇచ్చుకోవడం.. అటు పుచ్చుకోవడం..సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని కొలిచే మాసం శ్రావణ మాసం.ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి.ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే ప్రవిత్ర మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం ప్రారంభంతోనే, తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లి విరుస్తుంది.నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, గాయత్రి జపం, గోకులాష్టమి.. ఇలా రకరకాల పండగులతో శ్రావణం ..వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.వేదాలు , పురాణాలు సూచించిన మార్గాన్ని అసురించడానికి ,శ్రావణ మాసానికి మంచిన మాసం లేదంటారు పెద్దలు.ఈ నెలలో ప్రతీ రోజూ పుణ్యప్రదమే..తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రోత్సవాల పేరుతో స్వామికి విశేష పూజల్ని శ్రావణంలోనే జరపించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ మాసంలో  వచ్చే సోమావారాలలో శివాలయ సందర్శనం, పరమేశ్వరుడి అభిషేకంతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలకు, శుక్రవారాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు మహిళలు. మంగళవారాల్లో మంగళగౌరిగా పిలిచే  పార్వతీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఈ శుక్రవారాల్లో లక్ష్మీ దేవిని పూజిస్తే అష్టశ్వర్యాలు కలుగుతాయని , వరలక్ష్మీ దేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు.

error: Content is protected !!