ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎదిగిన వ్యక్తుల్లో నాని ఒకడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఒక దసరా, ఒక హైనాన్న లాంటి చిత్రాలతో, గొప్ప విజయాలను అందుకున్నాడు.అలాంటి హీరో దసరాలో సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికైన హీరో,ఫిల్మ్ వేదికపై ఏం మాట్లాడాడో తెలుసా..నాకు అవార్డులు అంటే ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు.ఇలా అనడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.కెరీర్ బిగినింగ్ లో స్టార్స్ అందరితో కలసి కూర్చోని, వారి మధ్య అవార్డులను అందుకుంటుందో ఆనందమే వేరని,కాని ఇప్పుడు తనకు అలాంటి అసక్తి లేదని తెలిపాడు నాని.పైగా కొత్త తరం టెక్నీషియన్స్ అవార్డులు అందుకుంటుంటే చూడాలని ఉందని తెలిపాడు.తన సినిమా దర్శకులు శ్రీకాంత్ ఓడెల, శౌర్యువ్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను తన చేతులతో అందించడం చాలా ఆనందం ఉంది అన్నాడు.69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ హైదరబాద్ లో ఘనంగా జరిగాయి. దసరాలో సినిమాలో నటనకు నాని ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు.