28ఏళ్ల క్రితం భారతీయుడు రిలీజైనప్పుడు, పాన్ ఇండియా వైడ్ గా సంచలనం. పేరుకే తమిళ చిత్రం అయినా, తెలుగు,తమిళ,హిందీ , కన్నడ, మలయాళ భాషల్లో దుమ్మురేపింది. డబ్బింగ్ సినిమా అయిన డబ్బులు బాగా వసూలు చేసింది. ముఖ్యంగా భారతీయుడు పాత్రలో శంకర్ నటన,ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే,సహజంగానే భారతీయుడు సీక్వెల్ పై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. పైగా శంకర్ దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం,తెరకెక్కించడం చేయడంతో, భారతీయుడు -2 రిలీజ్ కు ముందు చాలా క్రేజ్ కనిపించింది.ఒక రెహమాన్ పాటలు లేవనే కాని,అనిరుథ్ కూడా తనవంతుగా మంచి పాటలే ఇచ్చాడు.అయితే మొదటి భాగం స్థాయిలో రెండవ భాగం పాటలు విజయవంతం కాలేదు.అయినప్పటికీ ఈ సినిమా తొలిరోజు 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ రావడంతో, భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.మొత్తంగా 150 కోట్లు రాబట్టింది అంతే..అంటే పెట్టిన పెట్టుబడిలో సగం కూడా థియేటర్స్ నుంచి రాలేదు.ఇఫ్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.ఆగస్ట్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.అయితే భారతదేశంలో భారతీయుడికి ఫ్యాన్స్ ఎక్కువ.థియేటర్స్ లో చూడని వారు ఇఫ్పుడు ఓటీటీలో చూస్తారా.. చూస్తే ఏ స్థాయిలో చూస్తారు..\చూసినా.. ఒకవేళ శంకర్ ను టార్గెట్ చేస్తారేమో అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి.ఏ సినిమా అయితే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో, ఇప్పుడు అదే సినిమా సీక్వెల్,శంకర్ కెరీర్ లో మాయని మచ్చగా మారి వెక్కిరిస్తోంది.

error: Content is protected !!