స్పిరిట్ లోకి సూపర్ హిట్ పెయిర్?

సెన్సేషనల్ కాంబినేషన్‌ సెట్ చేస్తోన్న సందీప్?

ఒకప్పుడు టాలీవుడ్ ఫేవరేట్ జోడి, ఇప్పుడు పాన్ ఇండియాకు ఫేవరేట్ గా మారుతారా?

ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్స్ లో స్పిరిట్ కు చాలా క్రేజ్ ఉంది. అలా ఎందుకు ఉంది అంటే, సందీప్ వంగా లాంటి దర్శకుడు రెబల్ స్టార్‌ను, ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టార్ కాస్ట్ ను ఫిక్స్ చేస్తున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ముందు యానిమల్ హీరోయిన్ రష్మికను, ప్రభాస్ కు జోడిగా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. కాని, ఇప్పుడు ఆ ఛాన్స్ ను త్రిష అందుకుంది అనేది టాక్. స్పిరిట్ లో వీరి కాంబినేషన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు లీక్ ఇచ్చాయి.

ప్రభాస్, త్రిష గతంలో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో కలసి నటించారు. వీటిల్లో వర్షం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇక పౌర్ణమి , బుజ్జిగాడు చిత్రాల్లో వీరి జోడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఇప్పుడు 15 ఏళ్లకు అంటే బుజ్జిగాడు రిలీజైన ఇన్నేళ్లకు,స్పిరిట్ లో ఈ సూపర్ హిట్ పెయిర్ రిపీట్ అవుతోందని తెలిసి వర్షం, బుజ్జిగాడు మూవీ ఫ్యాన్స్ జోష్ మీదున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నాడు సందీప్ వంగా. ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నప్పటికీ,

ఇంకొంత ఆలస్యం ఆయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ టాక్. మరో వైపు త్రిష తమిళ నాట చాలా చిత్రాలు చేస్తోంది. తెలుగులో చిరు సరసన విశ్వంభర అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు స్పిరిట్ లోకి ఆమె అడుగు పెడితే మాత్రం, పాన్ ఇండియా వైడ్ గా త్రిషకు మరింత గుర్తింపు రావడం ఖాయం.

error: Content is protected !!