అలాంటోడు తిరిగొస్తే కాదు.. తిరిగొస్తున్నాడు..

త్వరలోనే ఓజీ సెట్ లోకి పవర్ స్టార్

కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్

ఆంధ్రప్రదేశ్ ఉప  ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన శాఖల పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు.ప్రజలు తనపై, తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు అడుగులు వేస్తున్నారు.అయితే పవర్ లోకి వచ్చిన పవర్ స్టార్ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని, అందరూ, ముఖ్యంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ చేతిలో ఒక్క చిత్రం ఉంటే వేరు, ఏకంగా అరడజను చిత్రాలు ఉన్నాయి. అన్నిటికి అన్ని క్రేజీ ప్రాజెక్టులే.. కాని ఓజీ మాత్రం సమ్ థింగ్ స్పెషల్. పైగా ఇటీవల పిఠాపురం వెళ్లినప్పుడు పవన్ స్వయంగా ఓజీ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఓజీ చూద్దురు గాని బాగుంటుంది అంటూ అభిమానులను హుషారెత్తించారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని, ముందు ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే పనిలో ఉంటానని, కొంత సమయం తర్వాత,సినిమాలను తిరిగి ప్రారంభిస్తానని పవన్ తెలిపారు. ఇప్పుడు అక్టోబర్ నుంచి ఓజీ సెట్ లోకి పవన్ అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కేవలం పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాదాపు 25 రోజుల కాల్ షీట్స్ అవసరం ఉంటుంది. వీటిని ఏక మొత్తంలో కాకుండా, ముందు అక్టోబర్ లో కొన్ని డేట్స్ ఇచ్చేందుకు పవన్ ఆశక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి దర్శకుడు సుజిత్ కు పవన్ కబురు పంపారట. అన్ని కుదిరితే ఓజీని వచ్చే ఏడాది వేసవిలో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!