ఒకప్పుడు శంకర్ సినిమా అంటే,
ఇండియా మొత్తం క్రేజ్ కనిపించేది.
ఆయన తీసిన సినిమాలు,
ఇప్పటికీ అబ్బురపరుస్తాయి.
అలాంటి డైరెక్టర్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.
మినిమం హిట్ కొట్టేందుకు కష్టాలు పడుతున్నాడు.
కాని ఈ ఏడాది శంకర్ నామ సంవత్సరంగా మారబోతోంది.
మెగా మేకర్ నుంచి ఒకటి కాదు ఏకంగా రెండు,
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి.
తీసిన ప్రతి సినిమాతోనూ సెన్సేషన్ సృష్టించడం,
బాక్సాఫీస్ను షేక్ చేయడం,
హీరోలకు తిరుగులేని పేరు రావడం,
చాలా కొద్ది మంది దర్శకులకు మాత్రమే సాధ్యపడుతుంది.
అలాంటి దర్శకుల్లో శంకర్ ఒకడు.
కాని రోబో తర్వాత శంకర్ మార్క్ సినిమా ఇంత వరకు రాలేదు.
ఆ లోటు కోలీవుడ్ను చాలా కాలంగా వెంటాడుతోంది.
ఒకప్పుడు హాలీవుడ్ కు ధీటుగా,
ఇండియాలో సినిమాలు అంటే,
శంకర్ పేరు మాత్రమే వినిపించేది.
కాని గత 14 ఏళ్లుగా శంకర్ స్పీడ్ తగ్గాడు.
అందుకు చాలా కారణాలు ఉన్నాయి.
కాని ఇప్పుడు శంకర్ కు మంచి రోజులు రాబోతున్నాయి.
ఇండియన్ సినిమాకు,
అలాగే వరల్డ్ సినిమాకు,
శంకర్ అంటే ఏంటో చూపించాలనుకుంటున్నాడు.
ఈ ఏడాదే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఏళ్లకు ఏళ్లు నిర్మాణంలో ఉండిపోయిన,
శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ భారతీయుడు -2,
మే చివరి వారంలో రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది.
మే 31న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది.
ఇక గేమ్ ఛేంజర్ కూడా డిసెంబర్ లో రిలీజ్ ఖాయం మైనట్లు ప్రచారం సాగుతోంది.
డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నాడట దిల్ రాజు. శంకర్ లాంటి దర్శకుడు కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు అంటే,
ఇండియన్ బాక్సాఫీస్ మినిమం వెయ్యి కోట్ల సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తుంది.
మరి శంకర్ ఆ మార్క్ ను, ఎక్స్ పెక్టేషన్స్ను అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.
మేలో భారతీయుడు -2, అలాగే డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ తో భారతీయ సినిమాకు తనవంతుగా 2 వేల కోట్లను అందిస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!