ఈ ఏడాది ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పాన్ ఇండియాను షేక్ చేసిన పర్ఫెక్ట్ తెలుగు మూవీ కల్కి.. ఆగస్ట్ 23న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేస్తోంది. దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి, బాక్సాఫీస్ దగ్గర అంతకు డబుల్ వసూళ్లను రాబట్టింది. చిత్ర యూనిట్ 1100 కోట్ల మార్క్ తో ఆపేసింది. కాని ఫైనల్ కలెక్షన్స్ కాస్త అటూ ఇటూగా 1200 కోట్లు ఉండే అవకాశం ఉంది.మహాభారత కథను స్ఫూర్తిగా తీసుకుని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కిలో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్, అలాగే భైరవ, కర్ణుడు పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఇంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్ దగ్గర అనేక సంచలనాలు సృష్టించిన కల్కి..ఓటీటీలోనూ అదే తరహాలో రికార్డులు తిరగరాసే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!