దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు భారత క్రికెటర్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుందని బోర్డ్ అభిప్రాయపడుతోంది. గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ మహ్మద్ షమీని నేషనల్ టీమ్ లో రీఎంట్రీకి ముందు దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు అతడిని కోరే అవకాశాలు లేకపోలేదు. రోహిత్, కోహ్లీ, అశ్విన్, బుమ్రా, జడేజా, అక్షర్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ,పంత్ .. ఇలా స్టార్ క్రికెటర్స్ అందరూ దులీప్ ట్రోఫీ ఆడనున్నారని సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి 22 మధ్య జరగబోయే దులీప్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం అతిథ్యమివ్వనుంది. నిజానికి దులీప్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లను ముందుగా అనంతపూర్ లో ప్లాన్ చేసారు. కాని టాప్ ప్లేయర్స్ బరిలోకి దిగుతుండటం, అనంతపురం లో ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడంతో ఈ రెండు మ్యాచ్ లను బెంగుళూరుకు తరలించారు.

error: Content is protected !!