మెగా హీరోలు మాంచి కామెడీని పండించగలరు. సాక్షాత్తు చిరంజీవి చంటబ్బాయ్, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి చిత్రాల్లో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కామెడీ సంగతి తెలిసిందే. తమ్ముడు, జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో పవన్ పండించిన హాస్యం,ఆయా సినిమాలను బ్లాక్ బస్టర్ వైపు నడిపించాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కూడా తనలోని కామెడీ యాంగిల్ ను ,ఆడియెన్స్ కు చూపించాలనుకుంటున్నాడు. గేమ్ ఛేంజర్ లో కాదు. ఆ తర్వాత రానున్న బుచ్చిబాబు మూవీలో కొంత కామెడీ పండించే అవకాశం తనకు ఉందని, ఓ ఈవెంట్ లో ఫుల్ క్లారిటీతో చెప్పాడు రామ్ చరణ్. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శాండల్ వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీరోల్ పోషిస్తున్నారు. ఇంత పెద్ద సినిమాలో కామెడీకి స్కోప్ ఉంటుందని రామ్ చరణ్ చెప్పుకురావడం, మెగాభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాదే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

error: Content is protected !!