అక్టోబర్ 10 తమిళ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద యుద్దం జరగబోతోంది. ఇటు వైపు చూస్తే పాన్ ఇండియా సినిమా కంగువతో సూర్య బరిలోకి దిగుతున్నాడు. ఏళ్లకు ఏళ్లు నిర్మించి,కోలీవుడ్ కు వెయ్యి కోట్లు కురిపించాలనే డ్రీమ్ తో, ఈ ప్రాజెక్ట్ లో నటించాడు సూర్య. అయితే సేమ్ డేట్ ఇప్పుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం వేట్టాయన్ కూడా రిలీజ్ అవుతుండటంతో, కొద్ది రోజులుగా రజనీకాంత్ కోసం సూర్య తన డేట్ ను త్యాగం చేస్తాడని ప్రచారం సాగింది. కాని ఇందులో నిజం లేదంటున్నాడు సూర్య. కంగువ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయడానికి దసరాను మించిన సీజన్ లేదు అంటున్నాడు. ఆల్రెడీ దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్ లో మూవీస్ లాక్ కావడమే అందుకు కారణం అంటున్నాడు. సో అక్టోబర్ 10న తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ వర్సెస్ సూర్య బాక్సాఫీస్ వార్ ను చూడటం ఖాయం. అయితే సూర్యకు బలమైన సౌత్ మార్కెట్ లో,రజనీకాంత్ చెక్ పెట్టడం ఖాయం. జైలర్ తర్వాత రజనీకాంత్ మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమ పై పట్టు సాధించారు. ఈ దశలో కంగువ పై ఎంతైతే అంచనాలు ఉన్నాయో, అదే విధంగా రజనీకాంత్ కొత్త చిత్రం పై ప్రేక్షకులకు అంచనాలు ఉన్నాయి. పైగా జై భీమ్ లాంటి సినిమాను తీసిన జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో, ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే రెండు పెద్ద చిత్రాలు ఒకే రోజు పోటీ పడినప్పుడు, వసూళ్ల విషయంలో పట్టువీడాల్సి ఉంటుంది. మరి వీరిద్దరిలో ఎవరు విన్నర్ అనేది తెలియాలంటే మాత్రం వచ్చే అక్టో బర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే