వెండి ఏంటి.. ఈ రేట్ ఏంటి అనుకుంటున్నారా.. గోల్డ్ కంటే సిల్వర్ కే గీరాకీ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ లో వెండి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో ముఖ్య కారణం ట్యాక్స్ తగ్గించడం. స్మర్లింగ్ ను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. గత ఏడాది భారత్ 3,625 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది ఈ మొత్తం డబుల్ కానుందని, అంటే, 6,500 – 7000 టన్నుల వరకు ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఈ ఏడాది వెండి ఆభరణాలకు గిరాకీ బాగా పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ ట్రానిక్ వస్తువుల తయారీదారుల నుంచి పెరుగుతున్ డిమాండ్ కారణంగా ..బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం వెండికి ఉన్న డిమాండ్ చూస్తుంటే త్వరలోనే కేజీ వెండి ధర లక్ష రూపాయలు చేరుకునే అవకాసాలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments to show.