బాహుబలి 2 కోసం ఒకప్పుడు,
ఆడియెన్స్ ఎంతగా ఎదురు చూసారో,
యానిమల్ సీక్వెల్ కోసం,
అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కాని సందీప్ వంగా ప్లాన్స్ వేరుగా ఉన్నాయి.
ఇప్పుడప్పుడే యానిమల్ 2 రాదంటున్నాడు.
కాని బీటౌన్ మాత్రం యానిమల్ సీక్వెల్ కు సంబంధించిన విలన్ ను కన్ ఫామ్ చేసేసింది.
తొలి భాగంలో బాడీ డియోల్ దుమ్మురేపాడు.
మరి రెండో భాగంలో యానిమల్ కు విలన్ ఎవరు?
ఇండియన్ సినిమాపై యానిమల్ ఇంపాక్ట్ చాలా ఉంది.
కొందరికి యానిమల్ చూస్తే షాక్ తలిగింది.
మరికొందరికి యానిమల్ తెరకెక్కిన విధానం ఇబ్బంది పెట్టింది.
అయితే బాక్సాఫీస్‌కు మాత్రం యానిమల్ పండగ తెచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా 900కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
ఇలాంటి బ్లాక్ బస్టర్ కు ఇమిడియెట్ గా సీక్వెల్ తీసుకొస్తే,
ఆ సినిమా ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి.
అందుకే బాలీవుడ్ కొంత కాలంగా,
యానిమల్ సీక్వెల్ గురించి,
అంటే యానిమల్ పార్క్ గురించి,
సందీప్ వంగా పై ప్రెజర్ తీసుకొస్తోంది.
అంతే కాదు సెకండ్ పార్ట్ లో నటించే నటీ నటుల వివరాలు అందిస్తూ ఎగ్జైట్ చేస్తోంది.
మొదటి భాగంలో విలన్ గా బాడీ డియోల్ కనిపించాడు.
యానిమల్ పార్క్ లో మరో విలన్ కనిపించబోతున్నాడు.
ఆ అవకాశాన్ని మల్లీశ్వరి భర్త, కత్రీనా హజ్బెండ్, బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌషన్ అందుకోబోతున్నాడుట. అయితే సందీప్ వంగా మాత్రం,ఇప్పుడప్పుడే యానిమల్ పార్క్ తెరితే అవకాశాలు లేవు అంటున్నాడు. ఎందుకంటే ముందు ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కిస్తానంటున్నాడు.
రాజాసాబ్, కల్కి సినిమాల షూటింగ్స్ ను రెబల్ కంప్లీట్ చేసుకొస్తే,
స్పిరిట్ షూట్ స్టార్ట్ చేస్తానంటున్నాడు సందీప్ వంగా.
సో యానిమల్ పార్క్ ఓపెన్ కావడానికి మరో రెండు మూడేళ్లు టైమ్ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.