టెస్ట్ మ్యాజ్.. మనకు తెల్సినంత వరకు 5 రోజులు జరుగుతుంది. దేశవాళీ క్రికెట్ లో, కొన్ని అనధికారిక టెస్టు మ్యాచుల్లో , కేవలం నాలుగు రోజులకు టెస్ట్ మ్యాచులు పరిమితం అవుతున్నట్లు విన్నాం. కాని ఆరు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఈ అరుదైన ఘట్టానికి శ్రీలంకలోని గాలె క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. వచ్చే నెలలో న్యూజిల్యాండ్ జట్టు, రెండు టెస్ట్ మ్యాచుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. సెప్టెంబర్ 18న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 21న ఈ మ్యాచ్ కు బ్రేక్ పడనుంది. ఆరోజు క్రీడాకారులకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగుతుంది. ఇలా ఎందుకు అంటే సెప్టెంబర్ 21న శ్రీలకం లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 1980, 90ల్లో ఇలా 6 రోజుల టెస్ట్ మ్యాచులు జరిగేవి. మళ్లీ చాలా ఏళ్లకు, ఈ అరుదైన క్రికెట్ మ్యాచ్ కు శ్రీలంకలోని గాలె క్రికెట్ స్టేడియం వేదిక కాబోతోంది.