ఒక సినిమా ఫ్లాప్ అయితే, అందుకు గల కారణాలను అన్వేషించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంతే కాని పరాజయానికి గల కారణాన్ని మరొకరి పై వేసి చేతులు దులుపుకుంటే ఎవరికి నష్టం. సరిగ్గా ఇదే మాటలు చెబుతున్నాడు అమిర్ ఖాన్. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసించిన ఆమిర్ ఖాన్ తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాల్ సింగ్ చెద్దా లాంటి చిత్రాలతో ఘోరమైన పరాజయాలను అందుకున్నాడు. ఈ ఫ్లాప్స్ పై ఒక ఇంటర్వ్యూలో తన మససులోని మాట చెప్పాడు. తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెరకెక్కిన విధానం తనకు నచ్చలేదని,ఆ విషయాన్ని దర్శకనిర్మాతలకు ముందే చెప్పాలని,కాని వారు సినిమా బాగానే వస్తోందని చెప్పారు..అందుకే తాను ఏం చేయలేకపోయాను అన్నాడు. ఇక తాను ఎంతో ఇష్టపడి నటించిన లాల్ సింగ్ చెద్దా ఫెయిల్యూర్ కు,సినిమాలో తాను చేసిన ఓవర్ యాక్షన్ అసలు కారణం అన్నాడు. హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ కు అఫీసియల్ రీమేక్. ప్రసిద్ద నటుడు టామ్ హాంక్స్ హీరోగా నటించాడు.అతడి పాత్రను తిరిగి పోషించడం అంటే చిన్న విషయం కాదు. కాని ఆమిర్ ఖాన్ ఈ సాహసం చేసాడు. టామ్ హాంక్స్ స్థాయిలో నటించాలనుకున్నాడు. కాని నటనలో ఆయన స్థాయిని అందుకోలేకపోయానని అమిర్ ఖాన్ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా పరాజయం కావడానికి సినిమాలో తన నటన ప్రధాన కారణం అన్నాడు. కాకపోతే ఇలాంటి సినిమా చేసినప్పుడు తనకు చాలా నేర్చుకోవడానికి , తెల్సుకోవడానికి ఉపయోగపడిందని, భవిష్యత్ లో ఇలాంటి తప్పులు చేయను అన్నాడు ఆమిర్ ఖాన్.ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు