త్రిబుల్ఆర్ తో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లినట్లే ,
దృశ్యంతో మాలీవుడ్ రేంజ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది.
ఈ సినిమాను చూసినోళ్లు,
చూసిట్లుగా రీమేక్ చేస్తున్నారు.
ఇది కొన్నేళ్లుగా కొనసాగుతున్న పరంపర.
రీసెంట్ గా దృశ్యం సినిమా చూసిన హాలీవుడ్,
ఇప్పుడు అర్జెంటు గా రీమేక్ చేస్తోంది.
ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైమ్,
ఓ మూవీ హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.
మాలీవుడ్ కు మామూలుగా కలసి రావడం లేదు.
కేవలం కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని సినిమాలు తీస్తోన్న మలయాళ సినిమా ఇండస్ట్రీ,
ఇప్పుడు అదే కంటెంట్ తో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లింది.
2013 అంటే పదేళ్ల క్రితం మాలీవుడ్ లో చిన్న చిత్రంగా రిలీజైన దృశ్యం,
ఇప్పుడు స్ట్రెయిట్‌ గా హాలీవుడ్‌ లోకి రీమేక్ అవుతోంది.
ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక అద్భుతం జరుగుతోంది.2013లో జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం,
మొదట మలయాళంలో సంచలన విజయం సాధించింది.
ఆ తర్వాత తెలుగు,తమిళ,కన్నడ, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయింది.
సింహలీస్, అలాగే చైనీస్ లోకి రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
ఆల్రెడీ ఇండోనేషియాలో, అలాగే కొరియన్ రీమేక్ ప్రాజెక్ట్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.
త్వరలో హాలీవుడ్ రీమేక్ స్టార్ట్ కానుంది.
దృశ్యంతో మాలీవుడ్ కూడా గ్లోబల్ రేంజ్‌కు ఎదిగినట్లైంది.
ఫ్యూచర్ లో దృశ్యం -2 మూవీస్ కూడా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక లాల్ దృశ్యం -3 లో నటించేందుకు సరైన ముహూర్తం కోసం చూస్తున్నాడు.
దృశ్యం-3 ..ఈ సిరీస్‌కు కన్ క్లూజన్.
అందుకే సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు మోహన్ లాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!