సీక్వెల్ అంటే కొన్ని లెక్కలుండాలి.
హీరో క్యారెక్టరైజేషన్ కంటిన్యూ కావాలి.
నయా విలన్ ఎంట్రీ ఇవ్వాలి.
హీరోయిన్ విషయంలో సర్ ప్రైజ్ ఉండాలి.
అందుకే పుష్ప నుంటి టిల్లు వరకు,
అందరూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ లో మెరిసిన బ్యూటీస్‌ను,
సెకండ్ పార్ట్ లోనూ ఒక్కసారి అలా వచ్చి మెరిసి వెళ్లమంటున్నారు.
పుష్ప రిలీజైనప్పుడు,
ఒక్క సాంగ్ లో కనిపించి సెన్సేషన్ సృష్టించింది సమంత.
ఆ తర్వాత ఆ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన సాంగ్ రాలేదు.
ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ అవుతోంది.
అందుకే పుష్పరాజ్ మరోసారి సామ్ డేట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాడట.
పుష్ప-2లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వమంటున్నాడట.
మార్చి ఎండ్‌లో టిల్లు తిరిగొస్తున్నాడు.
ఫస్ట్ పార్ట్ లో రాధికతో పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు,.
ఇప్పుడు సెకండ్ పార్ట్ లోనూ మరో రాధిక ఉంది.
కాని నేహాశెట్టికి ఉన్న క్రేజ్ తో,
సెకండ్ పార్ట్ లోనూ ఆమెను కొద్ది నిముషాలు కనిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడట టిల్లు.
సీక్వెల్లో కొద్ది నిముషాలు నేహా కూడా సందడి చేయనుందని సమాచారం.