వారం వారం థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వచ్చినట్లే.. వారం వారం ప్రతీ వీకెండ్ కు ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని వారాలు మాత్రమే, నెటిజెన్స్ కు ప్రత్యేకంగా మారుతుంటాయి. నవంబర్ 8 ఎన్టీఆర్ అభిమానులకు అలాగే ప్రత్యేకంగా మారనుంది. అందుకు కారణం, సేమ్ డే ఓటీటీలోకి దేవర వస్తున్నాడు. సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి దిగిన దేవర, బాక్సాఫీస్ దగ్గర పెద్ద దండయాత్రే చేసాడు. సరాసరి 500 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. హిందీ మార్కెట్ లోనూ ప్రభావం చూపాడు. ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో నెటిజెన్స్ కు అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన దేవర, ఓటీటీలో ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.