కేజీయఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎందుకో ఇప్పుడు సడన్ గా షారుఖ్ ఖాన్ కు సారీ చెప్పాడు.అందుకు కారణం గత ఏడాది డిసెంబర్ లో షారుఖ్ నటించిన డంకీ మూవీకి పోటీగా,తాను సలార్ చిత్రం విడుదల చేయడమే అన్నాడు. నిజానికి గత ఏడాది క్రిస్మస్ సీజన్ లో డంకీని రిలీజ్ చేయాలని షారుఖ్ ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. ఏడాది ముందుగానే రిలీజ్ డేట్ లాక్ చేసాడు. అయినా సరే ప్రశాంత్ నీల్ ఇవేం పట్టించుకోకుండా షారుఖ్ సినిమాకు పోటీగా తన చిత్రం సలార్ ను విడుదల చేసాడు. ఆ క్లాష్ కు సంబంధించి,ఇప్పుడు షారుఖ్ కు సారీ చెప్పాడు ప్రశాంత్ నీల్. నిజానికి ప్రశాంత్ నీల్, షారుఖ్ కు ఒక్కసారి కాదు, రెండు సార్లు సారీ చెప్పాలి. ఎందుకంటే 2018లోనూ షారుఖ్ జీరో అనే మూవీని క్రిస్మస్ సీజన్ టార్గెట్ గా రిలీజ్ చేసాడు. అయితే అదే సమయంలో కేజీయఫ్ వన్ ను విడుదల చేసాడు ప్రశాంత్ నీల్. విచిత్రం ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాలతో పోటీ పడిన రెండు సార్లు షారుఖ్ భారీగా వసూళ్లు కోల్పోయాడు. జీరో డిజాస్టర్ అయింది. సలార్ తో పోటీ పడిన డంకీకి అనుకున్నంత స్థాయిలో వసూళ్లను రాలేదు. అందుకే ప్రశాంత్ నీల్ షారుఖ్ కు ఒక్కసారి కాదు దోబార్ మాఫీ అడగాలి అంటున్నారు కింగ్ ఖాన్ ఫ్యాన్స్

error: Content is protected !!