హాలీవుడ్ అంటే,
ఏ అవెంజర్స్ గురించో లేక,
అవతార్ సినిమాల గురించో అనుకో అక్కర్లేదు.
ఎందుకంటే హాలీవుడ్ ఇప్పుడు మనకు బాగా దగ్గరైంది.
త్రిబుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ లో టాలీవుడ్ కు బాగా రికగ్నీషన్ వచ్చింది.
దాంతో ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు హాలీవుడ్ యాక్టర్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కామెరూన్ పేరు హాలీవుడ్ లో కంటే,
టాలీవుడ్‌లోనే ఎక్కువగా వినిపిస్తోంది.
అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్,
నేమ్ ఇప్పుడు టాలీవుడ్ లో రిపీటెడ్‌గా వినిపిస్తోంది.
అందుకు కారణం, రాజమౌళి కొత్త చిత్రం.
మహేష్ హీరోగా దర్శకధీరుడు ప్లాన్ చేస్తోన్న పాన్ ఇంటర్నేషనల్ మూవీ,
ఓపెనింగ్ కు జేమ్ కామెరూన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం.
త్రిబుల్ ఆర్‌ను రాజమౌళి తెరకెక్కించి విధానం చూసి,
ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫిదా అయిపోయాడు.
ఆస్కార్ సమయంలో ఈ సినిమా పై ప్రశంసలు కురిపించాడు.
రాజమౌళిని అభినందించాడు.
రీసెంట్ గా కూడా ఓ ఈవెంట్ లో రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఆకాశానికి ఎత్తేసాడు.
ఈ రిలేషన్ తోనే ఇప్పుడు జక్కన్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వస్తాడని టాక్ మొదలైంది.
త్రిబుల్ ఆర్ కోసమే ఇంగ్లీష్ యాక్ట్రెస్ ఓలివియా మోరిస్ ,టాలీవుడ్ కు తీసుకొచ్చాడు జక్కన్న.ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం,హాలీవుడ్ హీరోయిన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట.అయితే ఎవరా హీరోయిన్ అనేది మాత్రం క్లారిటీ లేదు.ప్రభాస్ కూడా హాలీవుడ్ వైపు చూస్తున్నాడు.హనురాఘవ పూడి దర్శకత్వంలో తెరకెక్కే ప్రేమకథా చిత్రంలో,కథనాయికగా హాలీవుడ్ హీరోయిన్ ను అనుకుంటున్నారట.
వార్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందట.
అయితే ఆ హీరోయిన్ ఎవరూ అనేది తెలియడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!