మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. అయితే సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, సీఎం ఏక్ నాథ్ షిండే మరికొద్ది గంటల్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు.సీఎం రేస్ లో బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే ప్రధానంగా పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ కు ఎన్ . సీ. పీ నేత అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని బీజేపీలోని మరి కొందరు నేతలు సూచిస్తున్నారట. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నేత ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

ఈ దశలో మహారాష్ట్ర రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది.  ఇప్పటికే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర నాయకత్వంతో చర్చలు ప్రారంభించారు. మరికొద్ది గంటల్లోనే మహారాష్ట్ర నూతన సీఎం ఎవరనేది తేలిపోనుంది.  

error: Content is protected !!