మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని , తాను రాజీనామా చేయలేదంటూ చెప్పుకొచ్చారు. మహావికాస్ అఘాడీ కూటమి లో భాగంగా కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 16 సీట్లతో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర ఏర్పాటు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇవే అతి తక్కువ స్థానాలు. 2021లో పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ,పటోలే నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి 13 స్థానాల్లో విజయాన్ని సాధించింది.

error: Content is protected !!