టాలీవుడ్ స్టార్స్,  మల్టీస్టారర్స్ కు, సీక్వెల్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ కమ్ సీక్వెల్ సెట్ అయినట్లు బాగా ప్రచారం సాగుతోంది. తెలుగు ప్రేక్షకులు , నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న, బాలయ్య, నాని కాంబినేషన్ ఆల్ మోస్ట్ సెట్ అయింది. అది ఎలా అంటే హిట్ సిరీస్ లోకి, నట సింహం అడుగుపెట్టనుందట. ఈ చిత్రాన్ని నాని నిర్మిస్తాడు అనే విషయం తెల్సిందే.

హిట్ -3 క్లైమాక్స్ లో హిట్ -4 హీరో కార్తి కనిపించాడు. అలాగే ఇప్పుడు హిట్ -4 క్లైమాక్స్ లో  , హిట్ -5 హీరో సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఆ హీరో ఎవరో కాదు బాలయ్యే అట. అంటే హిట్ -5ని బాలయ్య తన కంట్రోల్ లోకి తీసుకోబోతున్నాడు. బాలయ్య –నాని కాంబో అన్నారు, అలా అయితే నాని కేవలం నిర్మిస్తాడు అంతే కదా.. అనుకోవడానికి లేదు. ఎందుకంటే హిట్ -4, హిట్ -5లో కూడా తాను కనిపించబోతున్నట్లు, ఇటీవల చెప్పుకొచ్చాడు నాని.

ఇక హిట్ సిరీస్ ను హిట్ -7తో కంప్లీట్ చేయబోతున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 5, హిట్ 6 మూవీస్ భారీ ఎత్తున తెరకెక్కనున్నాయని, హిట్ -7తో ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడుతుందని, లాస్ట్ మూవీలో హిట్ హీరోలందరూ అంటే, విష్వక్, అడివి శేష్, నాని, కార్తి , బాలయ్య నటిస్తే ఆయన, అలాగే హిట్6 హీరో, ఇలా అందరూ కనిపిస్తారట. ఇటీవల విడుదల హిట్ -3 వంద కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!