పవన్ కల్యాణ్ సినిమాకు క్రేజ్ మొదలైతే, అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది, మరోసారి లైవ్ లో చూపిస్తోంది ఓజీ మూవీ. రిలీజ్ కు రెండు రోజుల ముందే, ఈ సినిమా  ప్రీసేల్స్ 50 కోట్లు దాటాయి అంటే చిన్న విషయం కాదు. సెప్టెంబర్ 25 మూవీ రిలీజ్ టైమ్ కు, ఈ సినిమా టాలీవుడ్ గత బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటిని తుడిచి పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా అంతటా ఓజీ మేనియా మొదలైంది. టాలీవుడ్ దాటి ఈ సినిమాను చిత్ర యూనిట్ ఎక్కడా ప్రమోషన్ చేయకపోయినా, కేవలం సుజిత్ అండ్ టీమ్ కట్ చేసిన ట్రైలర్ సినిమాకు బజ్ ను అమాంతం పెంచేసింది. ప్రస్తుతానికి నార్త్ ఇండియా, తమిళనాడు , కర్ణాటక లో ఈ సినిమాకు కనీవినీ ఎరుగని బుకింగ్ మొదలైంది. అందుకే ఇంత త్వరగా ఓజీ 50 కోట్ల వసూళ్లను దాటింది. మరో వైపు ఓవర్సీస్ మార్కెట్ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం 3 మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. రిలీజ్ టైమ్ కు ఓజీ రికార్డుల మీదే ఒక పెద్ద బుక్ రిలీజ్ చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. మరిన్ని ఓజీ రికార్డ్స్ కోసం ప్రైడ్ తెలుగు వెబ్ సైట్‌ను ఫాలో అవుతుండండి.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!