చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కు హాజరైన బీవైడీ భారత్ విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మార్కెట్ లోకి 25 నుంచి 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను తీసుకురావాలని నిర్ణయించినట్లు చౌహాన్ తెలిపారు. బీవైడీ ప్రధానంగా 20 -25 లక్షలు, అలాగే  40 – 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను భారత్ మార్కెట్ లో తీసుకురానుంది. ఇటీవల జరిగిన ఎక్స్ పోలో ఎలక్ట్రిక్ సీలయన్ 7 కారును కంపెనీ భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ కారు ధర 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉంటుందట. గత ఏడాది బీవైడీ ఇండియా భారత్ లో 3500 వాహనాలను విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరగనున్నాయని కంపెనీ ఆశిస్తోంది.

error: Content is protected !!