వైల్డ్ ఫైర్ అనగానే, అల్లుఅర్జున్ పుష్ప-2 డైలాగ్ గుర్తుకు వస్తుంది. కాని వైల్ ఫైర్ అనే డైలాగ్ డ్రాగన్ చెబితే అదిరిపోతుంది. ఇంతరీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడూ అనేది మన స్టోరీ. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది.

నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని వార్ -2 షూటింగ్ ఆలస్యం కావడంతో, ఆ ఇంపాక్ట్ డ్రాగన్ పై పడింది అని చెప్పవచ్చు. దాంతో ఇప్పుడు విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలోనే, డ్రాగన్ విడుదలకు అవకాశాలు ఉన్నాయి.

మే 20 ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. కాస్త అటూ ఇటూగా డ్రాగన్ ను వచ్చే ఏడాది టైగర్ బర్త్ డే సమయంలోనే విడుదల చేస్తారట. అదే నిజమైతే మాత్రం జూనియర్ ఫ్యాన్స్ కు పూనకాలే…ఎందుకంటే ఒకవైపు ఎన్టీఆర్ బర్త్ డే, మరో వైపు డ్రాగన్ లాంటి మూవీ రిలీజ్. ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఏముంటుంది. దానికంటే ముందు ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా, డ్రాగన్ టీజర్ రిలీజ్ అయ్యే అకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!