ఇండస్ట్రీ – మాలీవుడ్

బాక్సాఫీస్ – బ్లాక్ బస్టర్

కలెక్షన్స్ – 50 కోట్లకు పైనే

ఎప్పుడు రిలీజైంది? – ఫిబ్రవరి20 ( తెలుగులో మార్చి 14)

స్ట్రీమింగ్ ఎక్కడ? – నెట్ ఫ్లిక్స్ లో

ప్రైడ్ తెలుగు పంచ్ లైన్ – ఆఫీసర్ అదరగొట్టాడు

రేటింగ్- రివ్యూ మొత్తం చదవండి

మలయాళంలో తెరకెక్కే  చిన్న చిన్న చిత్రాలే, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందులోనూ అక్కడ భారీ విజయాన్ని అందుకున్న మూవీ అంటే, అది ఇంకెంత బాగుంటుందో కదా.. అలాంటి సినిమానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ.

నిజంగానే ఇది టైటిల్ కు తగ్గ చిత్రం. కథ మొత్తం ఒక ఆఫీసర్, అతని కేసు చుట్టూ తిరుగుతుంది. కథ చూస్తే చాలా రెగ్యూలర్ ఇన్వెస్టిగేటివ్ డ్రామానే అయినా సరే, దర్శకుడు జీతూ మ్యాజిక్ చేసాడు. తనదైన స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ థ్లిల్లర్ గా మార్చాడు. ముఖ్యంగా హీరో కుంచకో బోబన్, తనదైన యాక్షన్ తో ఇరగదీసాడు. ఇతను ఫ్రేమ్ పై కనిపించిన ప్రతీసారి, ఫైర్ రాజేసాడు. ఆఫీసర్ అంటే ఆఫీసర్ లాగే చేసాడు.

డ్రగ్స్ కు బానిసగా మారిన, ఒక ఆరుగురు యువతీయువకులు, తమకు అడ్డుగా నిలుస్తున్న వారందరిని, వేధించి, చిత్రహింసలు పెట్టి హత్య చేస్తుంటారు. ఇందులో కుంచకో బోబన్ సన్నిహితులు, కుటుంబం కూడా ఉంటుంది. దాంతో ఆఫీసర్ ఏం చేసాడు. సైకో గా మారిన గ్యాంగ్ ను ఎలా అడ్డుకున్నాడు అనేది స్టోరీ లైన్.

ఇతర పాత్రల్లో ప్రియమణి కనిపించింది. జగదీష్, వివేక్ నాయర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే సినిమాకు మరో రెండు హైలైట్స్ ఏంటంటే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. ఈ రెండు విభాగాలు ఈ చిత్రానికి రెండు కళ్లు. సరిపోదా శనివారం మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … ఈ సినిమా నరేషన్ ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.

మలయాళంలో కేవలం 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 14న విడుదల చేసారు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. వీలైతే ఒక లుక్ వేయండి. మీరు డిజప్పాయింట్ అవ్వరు.

ఈ సినిమాకు ప్రైడ్ తెలుగు ఇస్తోన్న రేటింగ్ – 7.5/10

error: Content is protected !!