
ముందు కేజీయఫ్ సిరీస్, ఆ తర్వాత కాంతార మూవీ, శాండల్ వుడ్ కు చాలా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే సిరీస్ అంటే, కాంతార నుంచి మరో మూవీ వస్తోంది. మొదటిసారి కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కాంతార వన్ ను తెరకెక్కించారు. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయం సాధించింది. అందుకే సెకండ్ పార్ట్ ను పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టి లోపెట్టుకుని,తెరకెక్కిస్తున్నారు. అందుకే కాంతార -2 రిలీజ్ ఆలస్యం అవుతోంది.
అన్ని కుదిరి ఉంటే, ఈ పాటికే సీక్వెల్ రిలీజ్ కావాలి. కాని కాలేదు. ఈ ఏడాది కాంతార సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 2న, గాంధీ జయంతి కానుకగా, కాంతార సీక్వెల్ స్టోరీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో, మూవీ పోస్ట్ పోయిందనే టాక్ మొదలైంది. దాంతో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. అక్టోబర్ 2 కాంతార తిరిగొస్తుందని ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసింది. మొదటి భాగం 15 కోట్లతో తెరకెక్కి, వరల్డ్ వైడ్ 450 కోట్లకు పైగా రాబట్టింది. అందుకే సెకండ్ పార్ట్ ను రిచ్ గా అంటే, దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో కాంతార -2 తెరకెక్కింది.
మొదటి భాగం తర్వాత రెండో భాగానికి కూడా కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే, కాంతార సీక్వెల్ లేదా కాంతార -2 అని మీకు అర్ధం కావడానికి స్టోరీ రాసుకొస్తున్నాం కాని ,రిషబ్ తీసుకొస్తున్నది కాంతార కు పీక్వెల్ మూవీ. గతంలో వచ్చిన కాంతారకు ముందు ఏం జరిగిందో రిషబ్ చెప్పబోతున్నాడు. మొత్తంగా మరో 7 నెలలు ఆగితే కాంతార లోకంలోకి ప్రేక్షకులు మరోసారి అడుగు పెట్టవచ్చు.