ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేసింది. తెలుగు నాట త్రిబుల్ ఆర్ గా పేరు తెచ్చుకున్నారు రఘురామ కృష్ణరాజు. పోటీగా ఇతరులు నామినేషన్ వేయకపోతే , డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అసెంబ్లీలో ఎన్టీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో వైసీపీ డిప్యూటీ స్పీకర్ పదవికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘు రామ కృష్ణరాజు ఎన్నిక లాంఛనం కానుంది. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామకృష్ణరాజు వైసీపీ అభ్యర్థి పై ఘన విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరిన సంగతి తెలిసేందే.